నక్షత్రం తెలుగు బులెట్ రివ్యూ …

nakshatram Movie Review

Posted August 4, 2017 at 11:50
నటీనటులు : సాయి ధరమ్ తేజ్ , సందీప్ కిషన్ , తనీష్ , ప్రకాష్ రాజ్ , రెజీనా , ప్రగ్యా జైస్వాల్ 
నిర్మాత :     శ్రీనివాసులు , సజ్జు , వేణుగోపాల్ 
దర్శకత్వం :  కృష్ణ వంశీ 
స్క్రీన్ ప్లే :    కృష్ణ వంశీ 
మ్యూజిక్ డైరెక్టర్ :  బీమ్స్ , మణిశర్మ 
ఎడిటర్ :     శివ వై. ప్రసాద్ 

ఓ మంచి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చేసిన ప్రయత్నమే నక్షత్రం. పోలీసు ప్రాధాన్యాన్ని చెప్పడానికి ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో వంశీ చేసిన నక్షత్రంలో సుందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, రెజినా, ప్రకాష్ రాజ్, తనీష్, జేడీ చక్రవర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీళ్లంతా కృష్ణవంశీని, కధని నమ్మి చేసిన సినిమా నక్షత్రం. వీరిలో కొందరు పారితోషికం కూడా తీసుకోకుండా ఈ సినిమా చేశారు. అంతగా నటీనటుల్ని కదిలించిన కృష్ణవంశీ నక్షత్రం ద్వారా ప్రేక్షకుల్ని ఎంతగా కదిలించాడో చూద్దాం.

పోలీస్ అంటే భయం గాక గౌరవంతో చూడాలని చెప్పేందుకు నక్షత్రం కధ తో కృష్ణవంశీ చెప్పడానికి ట్రై చేసాడు. పోలీస్ కావాలనుకునే రామారావు అనే ఓ సామాన్య కుర్రవాడికి ఆ లక్ష్య సాధనలో అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. వీటిని అధిగమించి తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఖాకీ డ్రెస్ లేని పోలీస్ గా వ్యవహరించాల్సి వస్తుంది. ఈ పాత్రలో సందీప్ కిషన్, అతనికి జంటగా జమునా రాణి గా రెజీనా చేసింది. ఇక ఉండేది కొద్దిసేపే అయినా ఓ టఫ్ పోలీస్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ , ఆయనకి జోడిగా ప్రగ్య జైస్వాల్ చేశారు. ప్రకాష్ రాజ్ ఓ బాధ్యతాయుత పోలీస్ పాత్ర చేయగా , తనీష్ తన కెరీర్ లో తొలిసారి పూర్తి స్థాయి విలన్ గా చేసాడు.

మొత్తం 166 నిమిషాల నిడివితో వున్న నక్షత్రం సినిమాలో ఆద్యంతం కృష్ణవంశీ కనిపించాడు. ఒక్కసారి ఒక్కో పాత్ర ద్వారా కనిపించాడు. అయితే తెర మీద సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రకాష్ రాజ్ పాత్రలు కనిపించిన ప్రతి సీన్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఓ కధ లోనుంచి సందేశం పుట్టడం వేరు. ఓ కాన్సెప్ట్ చుట్టూ కధ అల్లుకోవడం వేరు. ఈ విషయానికి వచ్చేసరికి రెండో ఫార్మాట్ లో కృష్ణవంశీకి దక్కిన విజయాలు తక్కువ. అందుకే ఈసారి ఆ లోపాన్ని అధిగమించడానికి కృష్ణవంశీ గట్టి ప్రయత్నం చేసాడు. దేశం, నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్ని పోలీస్ దృక్కోణం నుంచి చూపించిన వంశీ ప్రేక్షకుణ్ణి జాగృతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. కాకుంటే వినోదానికి, కొత్తదనానికి పెద్ద పీట వేస్తున్న ప్రేక్షకులు ఈ సీరియస్ ప్రయత్నాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదే ఎక్కడో వున్న చిన్న అనుమానం.

ప్లస్ పాయింట్స్ …
దర్శకత్వం
ప్రధాన పాత్రధారుల నటన
యాక్షన్ ఎపిసోడ్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ …
స్క్రీన్ ప్లే
క్లైమాక్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్…“నక్షత్రం” ఖాకీ దిక్సూచి
తెలుగు బులెట్ రేటింగ్ … 3 / 5 .

SHARE