మేకిన్ ఇండియా పరువు తీశారు

Pankaj Mahendhta Controversial Comments On Make In India

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి భారత్ బ్రాండ్ పెంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సాహసోపేతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. మూడేళ్లుగా విదేశీ పెట్టుబడులతో పాటు దేశీయ మదుపర్లకు కూడా స్టాక్ మార్కెట్ పై విశ్వాసం పెరిగింది.

అంతా సానుకూలంగా ఉన్న సమయంలో మనవాళ్లే మన దేశం పరువు తీసేశారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ మీటింగ్ కు వచ్చిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మహీంద్రా.. ఇండియా వరస్ట్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆశ్చర్యపోయారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన పంకజ్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ అట్టడుగున ఉందన్నారు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేసే కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని చెప్పారు. ఎంత వివరించినా.. మన దేశాన్ని మనమే తిట్టుకోవడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు:

నంద్యాలలో చంద్రబాబు ని ఏకేసిన జగన్…

బన్నీ సర్‌ప్రైజ్‌ ఏంటో?

‘ఫిదా’ వల్ల చైతూ మూవీ ఆగింది