పుష్ప 2 రిలీజ్ వాయిదాపై మేకర్స్ నుండి క్లారిటీ…!

పుష్ప 2 రిలీజ్ వాయిదాపై మేకర్స్ నుండి క్లారిటీ...!
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప 2 ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియన్ సినిమా లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఫాహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

పుష్ప 2 రిలీజ్ వాయిదాపై మేకర్స్ నుండి క్లారిటీ...!
Pushpa-2 the Rule

ఇక తమ సినిమా ని ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. విషయం ఏమిటంటే, ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడనుందని రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతుండడంతో తాజాగా పుష్ప టీమ్ ఆ రూమర్స్ పై స్పందించింది. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, పక్కాగా తమ సినిమా ముందుగా ప్రకటించిన మాదిరిగా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.