TS Politics: నేటి నుంచి బీఆర్‌ఎస్‌ సమావేశాలు..షెడ్యూల్‌ ఇదే

TS Politics: BRS meetings from today..the schedule is this
TS Politics: BRS meetings from today..the schedule is this

నేటి నుంచి అసెంబ్లీ నియోజకర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను ఈ సందర్భంగా స్వీకరించనున్నారు ముఖ్య నాయకులు.

ఈ సమావేశాలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రులు టీ హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌ రమణ హాజరుకానున్నారు.

🗓️ జనవరి 27
🔹సిద్దిపేట – హరీశ్‌ రావు
🔹బోథ్‌ – దేశపతి శ్రీనివాస్‌
🔹జూబ్లీహిల్స్‌ – కేటీఆర్‌
🔹వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹నల్లగొండ – కడియం శ్రీహరి

🗓️ జనవరి 28
🔹మెదక్‌ – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹సిరిసిల్ల – కేటీఆర్‌, దేశపతి శ్రీనివాస్‌
🔹ముషీరాబాద్‌ – ఎల్‌ రమణ
🔹పాలకుర్తి – హరీశ్‌ రావు

🗓️ జనవరి 29
🔹ఆలేరు – మధుసూదనాచారి
🔹నర్సంపేట – దేశపతి శ్రీనివాస్‌,
🔹ఖైరతాబాద్‌ – వేముల ప్రశాంత్‌రెడ్డి
🔹జగిత్యాల – హరీశ్‌ రావు
🔹వికారాబాద్‌ – కేటీఆర్‌
🔹జుక్కల్‌ – పోచారం శ్రీనివాస్‌రెడ్డి
🔹వర్ధన్నపేట – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
🔹చేవేళ్ల – కేటీఆర్‌