‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటోన్న మహేష్ బాబు ఫస్ట్ కటౌట్

‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటోన్న మహేష్ బాబు ఫస్ట్ కటౌట్
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా లో జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, హైపర్ ఆది, సునీల్, జయరాం, బ్రహ్మానందం కీలక పాత్రలు చేస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుంది .

‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటోన్న మహేష్ బాబు ఫస్ట్ కటౌట్
Guntur Karam

ఇక ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు తాజాగా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే, ఇక గుంటూరు కారం నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ కటౌట్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి అప్సర థియేటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కటౌట్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటుండగా దాని పిక్స్ సోషల్ మీడియాలో తేగా వైరల్ అవుతున్నాయి.