తనకేం తెలియదన్న తనీష్‌

i don't know anything drugs case Tanish

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తనీష్‌ హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే. హీరోగా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన తనీష్‌ డ్రగ్స్‌ కేసులో ఇరుకున్నాడు. డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌ వద్ద తనీష్‌ ఫోన్‌ నెంబర్‌ లభించింది. తనీష్‌, కెల్విన్‌ పలు సార్లు మాట్లాడుకున్నట్లుగా విచారణలో వెళ్లడైంది. దాంతో తనీష్‌ను సిట్‌ అధికారులు విచారణకు పిలిచారు. తనీష్‌ నేడు సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే. సిట్‌ అధికారులు తనీష్‌ నుండి పలు విషయాలను రాబట్టారు. 

కెల్విన్‌తో సంబంధం ఏంటి, పూరితో పరిచయం ఉందా, డ్రగ్స్‌ ఇచ్చే పబ్‌లకు వెళ్తారా అంటూ సిట్‌ అధికారులు తనీష్‌ను ప్రశ్నించారు. తనీష్‌ విచారణను చాలా త్వరగా సిట్‌ అధికారులు ముగించారు. తన తండ్రి చనిపోయిన బాధలో తాను ఉన్నాను అని, తాను ఇలాంటి కేసులో ఇరుక్కోవడం బాధగా ఉందని తనీష్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని, తనకు ఎలాంటి చెడు అలవాటు లేవు అంటూ సిట్‌ ముందు క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ఇక పబ్‌లకు, క్లబ్‌లకు కూడా తాను ఎక్కువగా వెళ్లను అంటూ తనీష్‌ చెప్పుకొచ్చాడు. డ్రగ్స్‌ టెస్ట్‌కు తాను సిద్దంగా లేను అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు:

వదినమ్మతో పవన్ కబుర్లు.

మళ్లీ వెండి తెరపై మహిష్మతిని చూడబోతున్నాం!

బిగ్‌బాస్‌కు మరెవ్వరు దొరకలేదా?