వదినమ్మతో పవన్ కబుర్లు.

pawan kalyan talking to chiranjeevi wife surekha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అన్న చిరంజీవికి నాన్న స్థానం, వదినమ్మ సురేఖ కి అమ్మ స్థానం ఇస్తానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పాడు. అయితే రాజకీయంగా ఇద్దరి అన్నదమ్ముల మధ్య విభేదాలు, మెగా ఫ్యామిలీ లోని స్టార్స్ కి సంబందించిన సినిమా ఫంక్షన్స్ కి పవన్ దూరంగా ఉండటంతో బయట ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటి వాటికి బ్రేక్ వేసే విషయం ఒకటి బయటికి వచ్చింది. ఎన్ టీవీ చౌదరి కుమార్తె వివాహానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మిత్రుడు త్రివిక్రమ్ తో కలిసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చాలా మంది సెలెబ్రెటీ లు ఆయన్ని పలకరించారు. వారితో మాట్లాడుతుండగానే పెళ్ళికి వచ్చిన చిరు సతీమణి సురేఖ పవన్ కి కనిపించారు. అంతే మిగిలిన వారికి ఇప్పుడే వస్తానని చెప్పి వదిన దగ్గరికి వెళ్లి పలకరించారు పవన్. పక్కన సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరు ఉన్నప్పటికీ చాలా సేపు వదినమ్మతోనే కబుర్లు చెబుతూ కనిపించారు పవన్.

అన్నగా చిరంజీవి అంటే గౌరవం వున్న పవన్ కి వదినమ్మ తోటే ఎక్కువ చనువు ఉండేదట. అందుకే తనకు ఏది కావాలన్నా వదిన ద్వారానే అన్నకి అప్లికేషన్ పెట్టేవాడట. అందుకే పవన్ లో ఆమె కొడుకుని, ఆమెలో పవన్ తల్లిని చూసుకునేవారు. అందుకే ఇప్పుడు ఇలా కలవడంతో హాయిగా కబుర్లు చెప్పుకున్నారు.

మరిన్ని వార్తలు:

మళ్లీ వెండి తెరపై మహిష్మతిని చూడబోతున్నాం!

బిగ్‌బాస్‌కు మరెవ్వరు దొరకలేదా?

అవి పుకార్లే అంటున్న సంపూ