బిగ్‌బాస్‌కు మరెవ్వరు దొరకలేదా?

Actress Diksha Panth Is The Hot New Wild Card Entrant On Jr NTR's Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోలో గత వారం రోజులుగా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. మొదట షో నిర్వాహకులు అనసూయను సంప్రదించడం జరిగింది. ఆమె బిజీ షెడ్యూల్‌ కారణంగా షోలో చేయలేను అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఇంకా పలువురు ప్రముఖులు సంప్రదించారు. కాని ఏ ఒక్కరు కూడా బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో ఏమాత్రం క్రేజ్‌ లేని దీక్షా పంథ్‌ను తీసుకు వచ్చారు. ఈమె తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందికి కనీసం ఎవరో కూడా తెలియదు. అలాంటి దీక్షాను ఎందుకు ఎంపిక చేశారో వారికే తెలియాలి. 

క్రేజ్‌ లేకున్నా గుర్తింపు ఉన్న స్టార్స్‌ ఎంతో మంది బిగ్‌బాస్‌లో కనిపించాని ఉవ్విల్లూరుతున్నారు. కాని షో నిర్వాహకులు బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారో లేక మరేంటో కాని దీక్షాను ఎంపిక చేయడం జరిగింది. దీక్షాపంత్‌ ఎంట్రీతో షోకు కలరింగ్‌ యాడ్‌ అయ్యిందని కొందరు భావిస్తుంటే మరో సోది క్యారెక్టర్‌ జాయిన్‌ అయ్యిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి వారం రోజుల తర్వాత దీక్షా పంత్‌ అందరికి అలవాటు అయిపోతుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె షోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో ప్రేక్షకులు ఉన్నారు.