దిల్‌రాజు సాయం.. ఇప్పటికైనా విడుదలయ్యేనా?

Dil Raju Helping For Vungarala Rambabu Movie Releasing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సునీల్‌ హీరోగా నటించిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రం కొన్ని నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు ఆరు నెలల క్రితమే ఈ సినిమా పూర్తి అయ్యింది. కాని సునీల్‌ కెరీర్‌ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు, అందులోనూ ఆ చిత్ర దర్శకుడు కూడా పెద్దగా గుర్తింపు ఉన్న దర్శకుడు కాదు. దాంతో సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాకు మంచి రోజులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ఈ సినిమాను నైజాం ఏరియాకు గాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాను చూసిన దిల్‌రాజుకు నచ్చడంతో వెంటనే నైజాం ఏరియాను తీసుకునేందుకు ముందుకు వచ్చాడు.

దిల్‌రాజు నైజాం ఏరియాకు కొనుగోలు చేసిన వెంటనే ఇతర ఏరియాల్లో ‘ఉంగరాల రాంబాబు’ను తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. దిల్‌రాజు సినిమాకు పాజిటివ్‌గా రెస్పాన్స్‌ అయితే ఆ సినిమా తప్పకుండా ప్రేక్షకులను రీచ్‌ అవుతుంది, ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. అందుకే దిల్‌రాజు తమ సినిమాలు తీసుకోవాలని చిన్న నిర్మాతలు కోరుకుంటూ ఉంటారు. తాజాగా సునీల్‌ సినిమాను దిల్‌రాజు తీసుకోవడం ఆ సినిమాకు పెద్ద హెల్ప్‌ చేసినట్లుగా చెప్పుకోవచ్చు. ఆరు నెలలుగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఇప్పటికైనా విడుదల కాబోతున్నందుకు సునీల్‌ ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు:

యుద్ధం శరణం టీజర్ అదరహో …

మళ్లీ ‘జై లవకుశ’కు లీక్‌ సమస్య

ఇలా పూరికి మాత్రమే సాధ్యం