మళ్లీ ‘జై లవకుశ’కు లీక్‌ సమస్య

Jai lava kusa Leaked Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జై లవకుశ చిత్రం టీజర్‌ విడుదలకు మూడు రోజుల ముందు లీక్‌ అయిన విషయం తెల్సిందే. లీక్‌ విషయమై నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. విషయం చాలా సీరియస్‌ అవ్వడంతో పాటు అందుకు ప్పాడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అదే విధంగా మరో సంఘటన జరిగింది. టీజర్‌ లీక్‌ అయ్యి కొన్ని రోజులు కాలేదు అప్పుడు అదే సినిమాకు చెందిన పాట వీడియో లీక్‌ అయ్యింది. చిత్రంకు సంబంధించిన ఒక కీలకమైన పాట లీక్‌ అవ్వడం పట్ల చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మరోసారి నిర్మాత కళ్యాణ్‌ రామ్‌ ఈ విషయమై పోలీసులకు ఆన్‌ లైన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. లీక్‌కు సంబంధించిన విషయం అధికారికంగా బయటకు చెప్పకున్నా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. లీక్‌ విషయం తెలిస్తే సినిమాకు డ్యామేజ్‌ అని భావిస్తున్నారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్‌ మీడియలో లీక్‌ అయిన వీడియో లేకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ తర్వాత లీక్‌కు పాల్పడిన వారు ఎవరు అనే విషయాన్ని కనిపెట్టబోతున్నారు. మొత్తానికి జై లవకుశ చిత్రం ఇలా వరుసగా లీక్‌ల బారిన పడుతుండటంతో చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

మళ్లీ వెండి తెరపై మహిష్మతిని చూడబోతున్నాం!

బిగ్‌బాస్‌కు మరెవ్వరు దొరకలేదా?

షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ మంచును విష్ణు