ఏఎంబి సినిమాస్ : మహేష్ బాబు మల్టీప్లెక్స్ మరో ఇంద్రభవనమే

Mahesh-Babu-Multiplex-To-Op

టాలీవుడ్ సూపర్ స్టార్ అనండి, ప్రిన్స్ అఫ్ టాలీవుడ్ అనండి లేదా శ్రీమంతుడు మహేష్ బాబు అనండి…ఇలా ఎన్ని బిరుదులు ఇచ్చిన వాటికి సరైనోడుగా మహేష్ బాబు అనిపిస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆలా అని మహేష్ బాబు కి సినిమాలే ప్రపంచం, ఇంకేవి పట్టవేమో అనుకుంటే మీరు పొరపడినట్టే. బహుశా అది మహేష్ బాబు కి పెళ్లి కాకమునుపేమో. కానీ, నమ్రత శిరోడ్కర్ ని మనువాడిన తరువాత మహేష్ బాబు కి సంబంధించిన మనీ వ్యవహారాలు, పెట్టుబడులు అన్ని తానే చూసుకుంటుంది.

amb-cinemas

ఇప్పటికే వీరు రియల్ ఎస్టేట్స్, రెస్టారెంట్స్ బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టగా, తాజాగా మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ చైన్ బిజినెస్ లోకి దిగాడు. ఏఎంబి సినిమాస్ గురించి చెప్పాలంటే, మహేష్ బాబు ఒక అందమైన ఇంద్రభవనం లాంటి మూవీ మల్టీప్లెక్స్ ని బొటనికల్ గార్డెన్స్ కి దగ్గరలో, గచ్చిబౌలి లో నిర్మించాడు. దీనికొరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ మరియు డిస్ట్రిబ్యూషన్ కి పేరొందిన ఏషియన్ సినిమాస్ తో భాగస్వామ్యం అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ ఏఎంబి సినిమాస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాలలో మరియు నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు కూడా చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో సినీప్రేక్షకుల కోసం ఎన్నో సౌకర్యాలను అమర్చారని, పిల్లలకోసం ప్రత్యేకమైన జోన్ కూడా ఉంటుందని సమాచారం. మొత్తం 7 సినిమా స్క్రీన్ లు ఉన్న ఈ మల్టీప్లెక్స్ లో అత్యాధునికమైన మరియు సౌకర్యవంతమైన సీట్లని ఏర్పాటుచేశారు.

amb-inemas-maheshbabu-wife

ఈ మల్టీప్లెక్స్ కి సంబంధించిన పూర్తి వ్యవహారమంతా మహేష్ బాబు భార్య నమ్రత శిరోడ్కర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఫారిన్ సిటీస్ లలో ఉండే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ఏఎంబి సినిమాస్ ని రూపొందించారని తెలుస్తుంది. ఏఎంబి సినిమాస్ ని దీపావళి రోజున థగ్స్ అఫ్ హిందుస్థాన్ సినిమా తో ప్రారంభించాలని మొదటగా అనుకున్నా, అనుకోని కారణాల చేత ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 29 న రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేసి, రజినీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా తో ఏఎంబి సినిమాస్ ని ప్రారంభిస్తారని సమాచారం.

Nagarjuna Favorite Song Is The Song Of Keeravani In Robo 2.0 Movie