టీఆరెస్ భారీ షాక్…ముగ్గురు ఎంపీలు కాంగ్రెస్ లోకి…!

2 TRS MPs Will Join Cong Before Polls

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు జరిగే లోపు వారిద్దరూ హస్తం గూటికి చేరడం ఖాయమని ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఒకరిని కాంగ్రెస్‌లోకి లాక్కోవడం ఖాయమని తెలిపారు. వారి భవిష్యత్ కోసం తమ నుంచి హామీ ఇవ్వాలని కోరుతున్నారని, ఆ చర్చలు పూర్తవగానే ఎన్నికలకు ముందే వారు పార్టీలో చేరతారని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే వారిని ఆపాలని సవాల్ విసిరారు. త్వరలో కేసీఆర్‌కు షాక్ కావడం కాదు, షేక్ అవుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.

trs-mps

ఆయన అధికారికంగా హస్తం గూటికి చేరకపోయినప్పటికీ, తెలంగాణ ఎన్నికల్లో అధిష్టానానికి పలు సూచనలు, సలహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో డీఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఆయన్ను ఘర్‌వాపస్ తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్‌ను మానసికంగా దెబ్బకొడతారా అనే చర్చ జరుగుతోంది. ఒకరు డి. శ్రీనివాస్ అయితే, మరొకరు ఎవరు అనే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మొదలైంది.అయితే ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి స్పందించిన తీరు కూడా ఈ జంపింగ్ కథనాలకు బలం చేకూర్చేలా తయారైంది. ఓ ప్రెస్‌మీట్‌లో విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్టుగా కాంగ్రెస్‌లో ఇద్దరు ఎంపీలు చేరబోతున్నారా?, అందులో మీరు కూడా ఉన్నారా? అన్న జర్నలిస్టుల ప్రశ్నలకు విశ్వేశ్వర రెడ్డి షాకింగ్ సమాధానం చెప్పారు.

revanth-kcr

‘ఇద్దరు కాదు ముగ్గురు’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డిని మీడియా వర్గాలు దీనిపై ఆరా తీయగా.. అదేమి లేదంటూ ఆయన మాట మార్చినట్టు తెలుస్తోంది. తాను పార్టీ మారుతున్నానని కొద్దిరోజులుగా అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా అదే ప్రశ్న అడుగుతుండటంతో ఒకింత విసుగుతో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదని విశ్వేశ్వరరెడ్డి గుర్రుగా ఉన్నారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటం అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అదే సమయంలో మహబూబాబాద్ ఎంపీ అయిన సీతారాం నాయక్ కూడా చాలా కాలంగా టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు చెక్ చెప్పి కేరళకు చెందిన ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్‌ను బరిలోకి దింపాలని పార్టీలో కుట్రలు పన్నుతున్నారని సీతారాం నాయక్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఈసారి శాసనసభకు పోటీ చేస్తుండడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానాన్ని సీతారాంనాయక్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. మరోవైపు, కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

kcr