మణిరత్నం నవాబ్ ట్రైలర్ : మాటల్లేవ్…

NAWAB Official Trailer

దర్శక దిగ్గజం మణిరత్నం సినిమా సినిమాల్లో ఒక ఫీల్ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫీల్ పట్టిన ప్రేక్షకుడు ఆయన సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి ఎదురుచూపరులని ఆనంద పరవశంలో ముంచేస్తూ అయన తాజాగా విడుదల కానున్న ప్రతిష్టాత్మక చిత్రం నవాబ్ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా ఇందులోని నటుల పాత్రల తాలూకు పోస్టర్లను రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్, నేడు ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసింది.

NAWAB

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలైన అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీరావు, ప్రకాశ్ రాజ్, జయసుధ పాత్రలను కవర్ చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి.