తమిళంలో హిట్‌.. తెలుగులో ఫట్‌…!

Nawab Film Hit In Tamil And Flap In Telugu

సౌత్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘నవాబ్‌’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో తెలుగులో ఈ చిత్రంను పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. తెలుగులో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. కాని తమిళంలో మాత్రం దుమ్ము రేపింది.

nawab movie jyothika

తమిళంలో విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కాని తెలుగులో మాత్రం కనీసం 5 కోట్ల షేర్‌ కూడా రాలేదని నిర్మాత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సినిమా ఒకటే అయినా ఫలితం విభిన్నంగా రావడం చర్చనీయాంశంగానే అయ్యింది. తెలుగులో ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేయడంతో నిర్మాతకు ఎక్కువ శాతం లాభం వచ్చే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. లాభాల మాట పక్కన పెడితే అసలు నష్టాలే ఎక్కువ అంటూ టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి మణిరత్నం సినిమా తెలుగులో మరోసారి ప్రేక్షకులను నిరాశ పర్చింది.

 

nawab jyothika