నవాబ్ ట్రైలర్ 2…పెద్దాయన పోతే ఎవరికీ లాభం !

నవాబ్ ట్రైలర్ 2...పెద్దాయన పోతే ఎవరికీ లాభం ! - Telugu Bullet

విభిన్న చిత్రాల దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా తమిళ చిత్రం ‘చెక్క చివంత వానమ్’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో అనువాదమవుతున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో అరవింద స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అదితిరావు హైదరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిరత్నం యాక్షన్ థ్రిల్లర్‌ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమామీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘నేనూ మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను కానీ తిరిగి తిరిగి నా మైండ్‌లో ఒక్కటే డౌట్ రన్నవుతోంది.

పెద్దాయన పోయాడంటే ఎవరికి లాభం’ అంటూ శింబు చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది. ‘సెగలు చిమ్ముతోంది పగను నమ్ముకుంది’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్ బాగుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మణిరత్నం, సుబకరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా తెలుగులో అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ట్రైలర్ మీద మీరు కూడా ఒక లుక్ వెయ్యండి మరి.