‘అరవింద సమేత’ అప్‌డేట్స్‌

aravindha sametha movie updates

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ విడుదలకు సిద్దం అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహిస్తామని చెప్పి ప్రేక్షకులను నిరాశ పర్చిన చిత్ర యూనిట్‌ సభ్యులు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. ప్రీ రిలీజ్‌ వేడుక తేదీపై తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చేసింది. సినిమా ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ వేడుక, సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

aravindha sametha

‘అరవింద సమేత’ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను అక్టోబర్‌ 1న విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్‌ 2న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక ఈ చిత్రంను అక్టోబర్‌ 10న యూఎస్‌లో ప్రీమియర్‌ షో వేయబోతున్నారు. ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా పెట్టుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మెగా బ్రదర్‌ నాగబాబు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా పలువురు ముఖ్య నటీనటులు ఈ చిత్రంలో నటించారు. త్రివిక్రమ్‌ మార్క్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో నమ్మకం వ్యక్తం అవుతుంది.