కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు…టీడీపీ 19 మంది జాబితా ఇదే !

TTDP ,List 5 Submitted To Congress

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జ‌న‌స‌మితిలు క‌లిసి మహాకూటమిగా ఏర్ప‌డి ప్రజా తీర్పుకోసం వెళ్లేందుకు సిద్దమయిన సాగతీ తెలిసిందే. కూటమి ఏర్పాటు ఖరారు అయితే అయింది కానీ కూటమి ఏర్పాటు, ఎజెండా, సీట్ల సర్దుబాటు విషయంలో ముందుకెళ్ళాల్సిన వ్యూహాలపై తొలిదశ చర్చలు నిన్న పూర్తయ్యాయి. అందులో భాగంగా కాంగ్రెస్‌కు కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతను అప్పగించారు. కూటమి ఏర్పాటుకోసం పట్టువిడుపులతో ముందుకు వెళ్లాలని అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకోసం కూటమి పక్షాలు సహా కాంగ్రెస్ పరిస్థితి, అభ్యర్థుల బలంపైనా సర్వే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు.
సర్వే కోసం తాము పోటీ చేయద‌లిచిన సీట్ల‌పై టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కసరత్తు పూర్తి చేసి ప్రతిపాదిత జాబితాను కాంగ్రెస్‌కు అందజేశాయి. అందులో టీడీపీ 15, సీపీఐ12, టీజేఎస్ 25 స్థానాలకు సంబందించిన నియోజకవర్గాలు, అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ముందుంచినట్లు తెలుస్తోంది. టీజేఎస్ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులు పెట్టినట్లు సమాచారం. మహాకూటమికి కామన్ ఎజెండా రూపొందించాలని, అధికారంలోకి వస్తే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించాలని, దానికి కోదండరాంను చైర్మన్ చేయాలని టీజేఎస్ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోపక్క టీడీపీ 30 స్ధానాలు కోరుతున్నట్లు సమాచారం. కూటమికి ఇబ్బంది కలుగకుండా కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతోందని తెలుస్తోంది. ఆ 30 లో కూడా ఒక 19 నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్ధుల పేర్ల‌ను కాంగ్రెస్ పెద్ద‌ల ముందుంచారు. సర్వేల ఆధారంగా పార్టీల బలాబలాలు అంచనా వేసి సీట్ల సర్దుబాటుపై రెండో దశ చర్చలు జరపాలని భావిస్తున్నారు.

congress and tdp

కాంగ్రెస్ కు టీటీడీపీ అందించిన జాబితా ఇలా ఉంది :

  1. శేరిలింగంపల్లి – మొవ్వ సత్యనారాయణ/ మండవ వెంకటేశ్వర రావు
  2. కూకట్‌పల్లి – మందాడి శ్రీనివాసరావు
  3. సికింద్రాబాద్ – కూన వెంకటేష్‌గౌడ్
  4. ఉప్పల్ – వీరేందర్‌గౌడ్
  5. ఖైరతాబాద్ – బి.ఎన్.రెడ్డి
  6. సికింద్రాబాద్ కంటోన్మెంట్ – శ్రీనివాసరావు,
  7. రాజేంద్రనగర్ – ఎమ్ భూపాల్‌రెడ్డి
  8. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే
  9. ఖమ్మం – నామా నాగేశ్వరరావు
  10. మిర్యాలగూడ -శ్రీనివాస్
  11. కోదాడ – బొల్లం మల్లయ్యయాదవ్
  12. ఆలేరు – శోభారాణి
  13. పరకాల-రేవూరి ప్రకాష్‌రెడ్డి
  14. ఆర్మూర్ – ఏలేటి అన్నపూర్ణ
  15. హుజూరాబాద్ – ఇనగాల పెద్దిరెడ్డి
  16. దేవరకద్ర – రావుల చంద్రశేఖర్‌రెడ్డి
  17. మహబూబ్‌నగర్ – చంద్రశేఖర్
  18. మక్తల్ – కొత్తకోట దయాకర్‌‌రెడ్డి
  19. కోరుట్ల -ఎల్ రమణ

ఇక సీపీఐ 12 స్థానాలు, టీజేఎస్ 25 స్థానాల జాబితాను అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఒకటి రెండు రోజుల్లో సర్వే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలకు కూర్చునే అవకాశం ఉంది.