లక్నోలో రెండు గంటల పాటు అదృశ్యమైన పవన్…!

Pawan Kalyan Gets Shocking Incident At Lucknow

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలెలాంటి కబురూ లేకుండా నిన్న ఉదయం హైదరాబాద్‌ నుండి లక్నో బయలుదేరి వెళ్ళడం సంచలనంగా మారింది. ఆయన మాయావతితో చర్చలు జరిపి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పబోతున్నారని అంతేకాక కుదిరితే ఏపీలో బీఎస్పీతో పొత్తులు పెట్టుకుంటారని మీడియాకి లీకులు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ కూడా తన వెంట కొత్తగా వచ్చి చేరిన నాదెండ్ల మనోహర్ తోపాటు.. దళిత వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, ఉస్మానియా విద్యార్థులతో కూడిన ఒక సేనను లక్నోకు తీసుకెళ్లారు.

janasena
అక్కడ మాయావతితో పాటు బీఎస్పీ అగ్రనేతలతో చర్చలు జరుపుతారని కాపు – దళిత సమేతంగా కొత్త రాజకీయానికి ఈ కలయిక కారణం అవుతుందని సోషల్ మీడియా జన సైనికులు పోస్టులు వదిలారు. అయితే అక్కడ జరిగింది మాత్రం పూర్తిగా రివర్స్ లో మాయావతిని కలిసి వస్తారనుకున్న పవన్ అంబేద్కర్ స్మృతి వనంలో పర్యటించారు. అయితే మాయావతిని కలిసి కూటమికి భూమిఒపూజ చేస్తారని ఊదరకోట్టిన నేపధ్యంలో అసలు ఆ ప్రయత్నాలు ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు సందేహార్ధకంగా మారింది.

JanaSena Party New Office Opening In Vijayawada
లక్నో వెళ్ళాక పవన్ బృందం మాయావతి అపాయింట్‌మెంట్ కోరగా తన పార్టీ జనరల్ సెక్రటరీని కలిసి వెళ్లమని మాయావతి పవన్ బృందానికి చెప్పారట. దాంతో నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ బీఎస్పీ జనరల్ సెక్రటరీ మిశ్రాను కలిసి వచ్చేశారు. అయితే లక్నో చేరిన తర్వాత పార్క్‌కు వెళ్లక ముందు పవన్ కల్యాణ్ సెక్యూరిటీని వద్దని చెప్పి రెండు గంటలకు పాటు ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లారని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పవన్ కల్యాణ్ రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎవర్ని కలవడానికి అంత సీక్రెట్ గా వెళ్లారనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది ?

pawan