ఏపీ మీద మరో ఐటీ పంజా…సాయం కోరితే బృందాలని పంపిన కేంద్రం…!

Vizag It Raids It Officials Conducts Raids At Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాను తితిలీ తుపాను అనాధను చేసి రోడ్డున నిలబెట్టింది. ఈ జిల్లాను కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఎప్పటికప్పుడు నివేదికలు పంపి తక్షణ సాయం చేయాలని పదే పదే లేఖలు రాస్తున్నారు. నష్టం అంచనాలకు కేంద్ర బృందాలను పంపాలని కోరుతున్నారు. పవన్ కళ్యాన్ కూడా లక్ష బిర్యానీ పార్సిళ్ళు అంటూ ఎదో ఒక నివేదిక రాసి గవర్నర్ కు అందించారు కూడా దీంతో కేంద్రం సాయం చేయకపోతుందా అని ఎదురు శూస్తున్న తరుణంలో కేంద్రం కొన్ని బృందాలను పంపింది. అయితే అవి నష్టం అంచనాలకు వచ్చినవి కాదు. ఇన్ కంట్యాక్స్ సోదాలకు వచ్చిన ఇతర రాష్ట్ర బృందాలు. విశాఖకు భారీగా ఐటీ ఉన్నతాధికారుల బృందాలు చేరుకున్నాయనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు అందింది. తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకుంటూ పెద్ద ఎత్తున ఐటీ దాడులు చేస్తారనే ప్రచారం అధికార పక్షంలో జోరందుకుంది.

vizag
కొన్ని రోజుల క్రితం రాజధాని ప్రాంతంలోని పరిసర జిల్లాల్లో దాడులు జరుగుతాయనే ఇదే తరహా సమాచారం ప్రభుత్వానికి రాగా అందుకు తగిన రీతిలోనే ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. తాజాగా విశాఖలో ఐటీ అధికారులు భారీగా దాడులు చేసే అవకాశం ఉందని దాదాపు 50 మంది అధికారులు వివిధ మార్గాల ద్వారా ఒడిశా, తెలంగాణ, చెన్నై, బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎంవీపీ కాలనీలోని ఐటీ కార్యాలయం వద్ద ఏకంగా యాభై వాహనాలను రెడీ చేశారు. ఉదయమే కొన్ని వాహనాల్లో కొంత మంది సోదాలకు వెళ్లారు. గాజువాక మం. దువ్వాడ ఎస్ఈజడ్‌లో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు. దువ్వాడలోని టీజీఐ కంపెనీలోనూ తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ దాడులు టీడీపీ నేతల కేంద్రంగానే జరుగుతాయని భావిస్తున్నారు.

It-Officials-Conducts-Raids