కళ్యాణ్‌రామ్‌కు మాట ఇచ్చిన త్రివిక్రమ్‌…!

Trivikram Green Signal In Kalyanram Banner

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమా అంటే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని పలువురు హీరోలు, నిర్మాతలు చాలా ముచ్చట పడుతారు. త్రివిక్రమ్‌తో సినిమా వారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని కూడా కొందరు హీరోలు చెబుతుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. త్రివిక్రమ్‌ ప్రస్తుతం హారిక హాసిని బ్యానర్‌పై వరుస చిత్రాలను చేస్తున్నాడు. తదుపరి చిత్రాన్ని కూడా ఇదే బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి యువి క్రియేషన్‌ నిర్మాణ సంస్థ మరియు డివివి దానయ్యలు ఇప్పటికే మాట తీసుకున్నారు. అయితే వీరితో త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌లు ఎప్పుడు అనేది స్పష్టం కాలేదు.

Trivikram-Green-Signal-In-K

తాజాగా త్రివిక్రమ్‌ మరో నిర్మాణ సంస్థకు కూడా మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ స్వంత బ్యానర్‌ నందమూరి తారకరామారావు ఆర్ట్‌పై ఒక చిత్రాన్ని చేయడానికి త్రివిక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు అనేది క్లారిటీ లేదు కానీ కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి త్రివిక్రమ్‌ పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ స్వీకరించినట్టు ఈయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడూ అనేది ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా విడుదలయి మంచి సక్సెస్‌ను సాధించింది.

kalyanram