మోడీ సెలవు మీద పంపిన సీబీఐ డైరక్టర్ మర్డర్ అటెంప్ట్…వారి పనేనా…!

Alok Verma Removed As CBI Director By High Powered Committee

అర్థరాత్రి రెండు గంటలకు సీబీఐ డైరక్టర్, స్పెషల్ డిప్యూటీ డైరక్టర్‌లను సెలవు మీద పంపడం. ఆ స్థానంలో నాగేశ్వరరావు లాంటి వివాదాస్పద అధికారిని నియమించడం ఆయన పూర్తిగా తెల్లవారక ముందే యాక్షన్ లోకి దిగిపోడం ఆరోపణలు వచ్చిన చేసిన అధికారుల వస్తువులన్నీ స్వాధీనం ఇదంతా ఎదో కలలా జరిగిపోయింది. ఇంత హడావుడిగా ఎందుకు ఈ సెలవులు అని ఆలోచిస్తున్న బుర్రలకి పెద్దగా పని చెప్పడం ఇష్టం లేక రంగంలోకి దిగిన జైట్లీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రస్తుతం సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని వాళ్ల పై వాళ్లే విచారణ చేసుకునేలా అనుమతించడం వీలుకాదు అని అందుకే వాళ్లను సెలవుపై పంపించామని ఆయన చెప్పుకొచ్చారు. సరే వారి మీద ఆరోపణలు ఉన్నాయి నిజమే ఈ పనంతా పగలు చేసుకోవచ్చు కదా, అర్థరాత్రి, తెల్లవారు జామున చేయాల్సిన పని ఏముందన్నది.. అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు.. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నెయ్తలు చేస్తున్న కొన్ని ఆరోపణలు విస్తుపోయేలా ఉన్నాయ్.

Cbi-Chief-Alok-Vermas
రాఫెల్‌ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు అలోక్ వర్మ సేకరిస్తున్నందునే ఆయనపై వేటు వేశారని రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు విపక్ష నేతలు నిన్నటి నుండి ఆరోపణలు ప్రారంభించారు. రాఫెల్‌స్కాంపై విచారణ చేపడతారన్న భయంతోనే సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని వారు అంటున్నారు. దీని ద్వారా రాఫెల్‌స్కామ్‌తో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉందని స్పష్టంగా రుజువు అవుతోందని నేతలు అంటున్నారు. నాగేశ్వరరావుపై సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు చాలా ఫిర్యాదులు వెళ్లాయని, దీనిపై దర్యాప్తు ప్రారంభించాలని కూడా అలోక్‌వర్మ అనుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో అలోక్‌వర్మను సెలవు పై పంపి నాగేశ్వరరావుకు సీబీఐ పగ్గాలు అప్పగించడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది.

Alok-Vermas
వాస్తవానికి వేల కోట్ల రూపాయల రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రాథమిక దర్యాప్తునకు వర్మ సిద్ధం కావడంతోనే మోదీ ఆయనను తప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు ఇటీవల రాఫెల్‌ కుంభకోణంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన అనేక పత్రాలను కూడా వారు సీబీఐకి అందజేశారు. ఈ నేపధ్యంలోనే ఆయనను సెలవు మీద పంపినట్టు బావిస్తున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ ఇంట్లోకి చొరబడేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. నలుగురు వ్యక్తులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐడీ కార్డులతో వచ్చి, అలోక్ వర్మ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిపై సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అవుతున్నారని భావించిన ఈ నలుగురూ పారిపోయేదానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది, జవాన్లు, వారిని అడ్డగించి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే వచ్చింది ఎవరైనా ఈ నెపం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాలలో వినిపిస్తున్న మోడీ పేరు మరింత పాడయ్యే అవకాశం కనిపిస్తోంది.