త్రివిక్రమ్‌, దేవరకొండల కాంభో…!

Nandini Reddy Movie With Vijay Devarakonda

యంగ్‌హీరో విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ నెడ్డి’, ‘గీతా గోవిందం’ చిత్రాలతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. విజయ్‌ దేవరకొండకు యూత్‌ ఫాలోయింగ్‌ ఓ రేంజ్‌లో ఉంది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న విజయ్‌ పేరు చెప్పగానే కుర్రకారు ఉర్రూతలూగుతున్నారు. ఈ క్రేజీ స్టార్‌తో సినిమా చేయడానికి అగ్ర నిర్మాతలు, దర్శకులు సైతం ఆసక్తి చూపుతున్నారు. అల్లు అరవింద్‌ దేవరకొండతో రెండు సినిమాలు చేయడానికి ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్రివిక్రమ్‌, విజయ్‌ల కాంబో జస్ట్‌ మిస్‌ అయిందని ప్రముఖ డైలాగ్‌ రచయిత లక్ష్మి భూపాల తాజాగా చెప్పుకొచ్చారు.

nandhini-reddy-movies

లక్ష్మి భూపాల మాటల్లో… విజయ్‌ దేవరకొండతో ఒక సినిమా చేయడానికి నందినీ రెడ్డి కథ రాసుకున్నారని, దీనికి స్క్రీన్‌ ప్లే కూడా ఆమె, ఈ కథతో త్రివిక్రమ్‌ వద్దకు వెళితేలీ కథకు విజయ్‌ దేవరకొండతో పాటు పలువురు హీరోలు కూడా అవసరం అవుతారని త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టారట. అప్పుడు త్రివిక్రమ్‌ ఒకే చెబితే ఈ పాటికి త్రివిక్రమ్‌, దేవరకొండల సినిమా విడుదల అయ్యేది అని. ఆ తర్వాత స్వప్నదత్‌ సూచన మేరకు నందినీ రెడ్డి ఇదే కథతో ‘గ్యాంగ్‌ స్టార్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ మొదలుపెట్టారు, ఇప్పటికి ఈ కథకు మల్టీస్టారర్‌ చిత్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మి భూపాల చెప్పుకొచ్చారు.

nandhini