నా వెనుక ఆయన హస్తం లేదంటున్న హీరోయిన్‌…!

Sruthi Hariharan Accuses Arjun Of Harassment

మీ టూ లో భాగంగా కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌ స్టార్‌ హీరో అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ‘విస్మయ’ చిత్ర షూటింగ్‌ సమయంలో అవసరం లేకున్నా తన వీపుపై చేయి వేసి అటూ ఇటూ రుద్దుతూ, హగ్‌ చేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారాన్ని రేపుతోంది. శృతి ఆరోపణలకు గాను కొందరు మద్దతు తెలపగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఇదంతా కూడా అర్జున్‌ ఇమేజ్‌ డ్యామేజ్‌ చేయడం కోసమే కొన్ని శక్తులు శృతిని పావుగా చేసి ఇలా అర్జున్‌పై ప్రయోగిస్తున్నారంటూ అర్జున్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ట్రోలింగ్స్‌ అధికమవడంతో శృతి తాజాగా వీటిపై స్పందించింది.

Sruthi Hariharan For Accusing Arjun Harassments

తన వెనుక ఏ శక్తి లేదని, నాపై జరిగిన లైంగిక దాడులను బయట పెడితే ఈ విమర్శలు ఏంటి అని శృతి వాపోతుంది. తనకు మద్దతుగా నిలిచిన ప్రకాష్‌ రాజ్‌, శ్రద్దా శ్రీనాద్‌, చేతన్‌, కవితలకు ధన్యవాదాలు తెలిపింది. నాకు ఉన్న జ్ఞానం ప్రకారం నాపై జరిగిన దాడిని బయట పెట్టాను తప్ప ఎవరు నా వెనుక ఉండి నడిపించడం లేదు, నా వెనుక పలువురి హస్తం ఉందనే వార్తలు పూర్తిగా అవాస్తవాలు, నా వెనుక ఎవరి హస్తం లేదు అంటూ శృతి క్లారిటీ ఇచ్చింది. తాజాగా అర్జున్‌తో చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న హీరోయిన్‌ ఖుష్బూ స్పందించి అర్జున్‌ అలాంటి వాడు కాదు అంటూ ఆర్జున్‌పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది.

Kushboo Supports Action King Arjun During Metoo