ట్యాక్సీవాలాపై విజయ్‌కు ఎందుకంత అపనమ్మకం…!

Vijay-Devarakonda-Next-Film

యంగ్‌హీరో విజయ్‌ దేవరకొండ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతా గోవిందం’ చిత్రాలతో యూత్‌లో క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. ఇటీవల ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన స్థాయిలో మెప్పించకున్నా కూడా విజయ్‌ తనదైన స్టయిల్‌లో బహిరంగ లేఖ రాసి మరింత అభిమానాన్ని చూరగొన్నాడు.

taxiwala

త్వరలోనే మంచి సక్సెస్‌తో మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులకు మాట ఇచ్చాడు. విజయ్‌ హీరోగా నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం ‘గీతా గోవిందం’ ముందు రిలీజ్‌ కావాల్సింది. కానీ ‘ట్యాక్సీవాలా’ చిత్రంపై విజయ్‌కు పెద్దగా నమ్మకం లేక ‘గీతాగోవిందం’ను ముందు విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యాడట. అనుకున్నట్టుగానే ‘గీతా గోవిందం’ చిత్రంను విడుదల చేసి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్నాడు.

Vijay-Devarakonda

‘గీతాగోవిందం’ చిత్రం తర్వాత ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేకపోయాడు.ఈ సమయంలో ‘ట్యాక్సీవాలా’తో వచ్చి సక్సెస్‌ అవ్వకపోతే అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతారని విజయ్‌ ఈ చిత్రాన్ని విడుదల కాకుండా చూడాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాని యూనిట్‌ సభ్యులు ఫిక్స్‌ అయ్యారు. కానీ ముందు నుండి ఈ చిత్రంపై విజయ్‌కు పెద్దగా ఆసక్తి లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. తాజాగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన విజయ్‌ తన గత చిత్రాలకు చేసిన విధంగా ఈ చిత్రానికి పబ్లిసిటీ చేయడం లేదు, ఈ చిత్రంపై విజయ్‌కు పెద్దగా నమ్మకం లేదు అందుకే ఇలా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు అని యూనిట్‌ సభ్యులు వాపోతున్నారు. ఇప్పుడు ఇలా ఉన్నా విజయ్‌ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడ్డాక తన క్రియేటివిటీతో పబ్లిసిటీ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ చిత్రం సక్సెస్‌ అయితే విజయ్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో మరి.

Vijay Devarakonda Taxiwala Movie Postponed