పిక్‌టాక్‌: ఇందిరాగా త్రిష ఇలా…

trish turned as indira gandhi

అగ్ర కథానాయికగా త్రిష స్టార్‌ హీరోల సరసన నటించి ఓ వెలుగు వెలిగింది. తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా కూడా తమిళంలో మాత్రం వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విడుదలయిన విజయ్‌ సేతుపతి ‘96’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న త్రిష తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయెపిక్‌లో నటించబోతుందనే వార్తలు జోరుగా సాగాయి. కానీ ఈ విషయమై త్రిష ఇంతవరకు స్పందించనే లేదు. తాజాగా ఈ అమ్మడి ఆయిల్‌ పెంట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

image.png

తమిళ మాగజైన్‌లో త్రిష ఆయిల్‌ పెంట్‌ను ప్రచురించారు. అయితే త్రిష మాజీ పీఎం ఇందిరాగాంధీ లుక్‌లో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. పొట్టి జుట్టు, ఆ చీరకట్టు, ఆ స్టిల్‌ను చూస్తుంటే ఒకసారి ఈమె త్రిషనా లేక ఇందిరా నా అనే సందేహం వచ్చేంతగా ఇందిరమ్మ లుక్‌లో అదిరిపోయింది. ఇందిరమ్మ లుక్‌లో త్రిషను చూసి ఈమె త్వరలో ఇందిరాగాంధీ బయోపిక్‌లో నటించబోతుంది అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే బయోపిక్‌ విషయమై క్లారిటీ లేదు కానీ ఇందిరాగా త్రిష మాత్రం సూపర్‌ సెట్‌ అయ్యింది. ఇందిరాగా త్రిష ఫొటోను మీరు ఒకసారి వీక్షించండి.