కేతిరెడ్డి ట్రాప్ లో వర్మ…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని బాలయ్య ముందుగా ప్రకటన చేసినప్పటికీ ఆ హీట్ అమాంతం పెంచింది మాత్రం రామ్ గోపాల్ వర్మ. బాలయ్య తనకే ఛాన్స్ ఇస్తాడన్న నమ్మకం కన్నా ఎలాగైనా ఎన్టీఆర్ బయోపిక్ కి తనతో కమిట్ చేయించాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ బయోపిక్ కి తాను దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పుకున్నారు. ఎప్పుడైతే తన అనుమతి లేకుండా స్టేట్ మెంట్ బయటికి వచ్చిందో అప్పుడే వర్మ ని పక్కనబెట్టాలని బాలయ్య డిసైడ్ అయిపోయారు. ఈ విషయాన్ని ఇంకొకరు అయితే ఎలా తీసుకునే వాళ్ళో కానీ వర్మ సంథింగ్ స్పెషల్ కదా. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వర్మ రివర్స్ గేర్ వేసాడు. “లక్ష్మీస్ ఎన్టీఆర్” అంటూ సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు. పైగా ఈ సినిమాకి వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాత కావడం ఓ రచ్చ . ఒకప్పుడు తనని దారి తప్పిన మేధావిగా అభివర్ణించిన లక్ష్మీపార్వతి కోణంలోఎన్టీఆర్ జీవితాన్ని చూపించడానికి వర్మ రెడీ కావడంతో పోలిక తప్పలేదు. బాలయ్య, తేజ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ని లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పోల్చి చూడడం ఎక్కువైంది. ఈ పరిణామం సహజంగానే బాలయ్యకు చిరాకు తెప్పించింది.

NTR Aathma Sandesham

అయితే వర్మకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది బాలయ్య టీం. అప్పుడెప్పుడో సినిమాలు తీసి, దర్శకత్వం వహించి ఇప్పుడు హాయిగా చెన్నైలో సెటిల్ అయిపోయిన కేతిరెడ్డిని సీన్ లోకి దింపింది. లక్ష్మీస్ వీరగంధం సినిమా ప్రకటనతో లక్ష్మీపార్వతి, వర్మ కి ఒకే దెబ్బతో షాక్ ఇచ్చాడు కేతిరెడ్డి. లక్ష్మీస్ వీరగ్రంధం పోస్టర్స్ తో లక్ష్మీపార్వతి మాటెలా వున్నా వర్మ ఆ ట్రాప్ లో పడిపోయాడు.

RGV-counter-to-Lakshmi's-Ve

తాను బాలయ్య, తేజ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్న వర్మ ఆ సంగతి గాలికి వదిలేసి లక్ష్మీస్ వీరగ్రంధం వెంట పడ్డాడు. ఆ సినిమా పోస్టర్ చూసి అమ్మాయి వీపు బాగుందని ఓ సారి, ఏ హీరో ఈ సినిమాలో ఉంటే బాగుంటుందని ఇంకోసారి చెప్పారు. ఇక తాజాగా ఎన్టీఆర్ వాయిస్ ఉపయోగిస్తూ ఓ షార్ట్ ఫిలిం కూడా చేశారు. ఇటు లక్ష్మీపార్వతికి అటు కేతిరెడ్డికి ఆత్మ రూపంలో కనిపించిన ఎన్టీఆర్ ఆ ఇద్దరూ చేస్తున్న పనికి మరొకరు అభ్యంతర పెట్టొద్దని హితవు చెప్తూ ఓ షార్ట్ ఫిలిం తీశారు. కేతిరెడ్డి తో మాట్లాడేటపుడు లక్ష్మీపార్వతి గురించి నాలుగు మంచి మాటలు ఎన్టీఆర్ తో చెప్పించారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న జనానికి ఓ ఇమేజ్ పడిపోయింది. బాలయ్య, తేజ కాంబినేషన్ లో తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఓ రకమైన సినిమా అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం పోటీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. దీంతో బాలయ్యని ఇబ్బంది పెట్టాలన్న వర్మ లక్ష్యం పక్కదారి పట్టింది. ఆ విధంగా జనం మేధావి అనుకునే రామ్ గోపాల్ వర్మ తేలిగ్గా కేతిరెడ్డి ట్రాప్ లో పడ్డాడు.