మళ్లీ సాహస నిర్ణయమే

Puri Jagannath Again Movie with His Son Akash

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మెహబూబా’. ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఇండో పాక్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. పూరి మార్క్‌లో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఆ చిత్రం ఉంటుందని ఆశించారు. కాని ఒక రొటీన్‌, సాదా సీదా చిత్రంగా మెహబూబా ఉంది. కొడుకు ఆకాష్‌ను హీరోగా నిలిపేందుకు దర్శకుడు పూరి స్వయంగా నిర్మాతగా మారాడు. మెహబూబా చిత్రం కోసం దాదాపుగా 25 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. నిర్మాణం సమయంలో ఇల్లు కూడా అమ్మకంకు పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

‘మెహబూబా’ ఫ్లాప్‌ అవ్వడంతో పూరి తీవ్రంగా నష్టపోయాడు. దాదాపు 15 కోట్ల మేరకు సినిమా వల్ల నష్టపోయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయినా కూడా ఇంకా తన అదృష్టంను పరీక్షించుకునేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు. తన కొడుకు రెండవ సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు. ఆకాష్‌ రెండవ సినిమాను కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు పూరి ఆసక్తిగా ఉన్నాడు. ఇటీవలే కథ సిద్దం అయ్యింది. త్వరలోనే స్క్రిప్ట్‌ను రెడీ చేసి, సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత చిత్రంలో పోల్చితే ఈ చిత్రంను కాస్త తక్కువ బడ్జెట్‌తో నిర్మించాలని భావిస్తున్నాడు. ఎంత తక్కువ బడ్జెట్‌తో తీసినా కూడా పూరి తీసుకున్న ఈ నిర్ణయం సాహస నిర్ణయమే అని చెప్పాలి. ఆకాష్‌ పూరి హీరోగా సక్సెస్‌ అవ్వాలంటే మరో అయిదు సంవత్సరాలు ఆగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుండేది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరి పూరి తీసుకున్న ఈ సాహస నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.