విద్యా బాలన్‌ వచ్చేసింది… రేపే ముహూర్తం

Vidya Balan attends NTR Biopic movie Shooting

‘ఎన్టీఆర్‌’ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొదట ఆగస్టులో చిత్రాన్ని ప్రారంభించాలని భావించారు. అయితే అంతకు ముందే అంటే రేపటి నుండే ఒక షెడ్యూల్‌ను నిర్వహించేందుకు దర్శకుడు క్రిష్‌ ఏర్పాట్లు చేశాడు. ఈ మొదటి షెడ్యూల్‌ దాదాపు వారం నుండి పది రోజుల పాటు జరుగనున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో విద్యాబాలన్‌తో పాటు ఇతర ముఖ్య నటీనటులతో చిత్రీకరణ జరుపబోతున్నారు. బాలకృష్ణ ఈ షెడ్యూల్‌లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో బసవతారకం పాత్ర గురించి అనేక వార్తలు మీడియాలో షికారు చేశాయి. తాజాగా ఈ విషయమై దర్శకుడు క్రిష్‌ మాట మాట్లాడుకుండానే క్లారిటీ ఇచ్చేశాడు.

విద్యాబాలన్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో నటించేందుకు తాజాగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆమెకు చిత్ర యూనిట్‌ సభ్యులు సాదర స్వాగతం పలకడం జరిగింది. ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రను పోషించబోతున్నందుకు ఆమెకు నందమూరి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్‌ దక్కింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి క్రేజ్‌ను కలిగి ఉన్న దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కారణంగానే విద్యా బాలన్‌ ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం విద్యా బాలన్‌ 30 రోజుల డేట్లు ఇవ్వడం జరిగింది. భారీ ఎత్తున పారితోషికంను విద్యా బాలన్‌ ఈ చిత్రం కోసం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యా బాలన్‌ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.