పడుకోవడం వల్లే నాకు అవకాశాలు వచ్చాయి

Mallika Sherawat hot comments on Casting Couch

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది చాలా కాలంగా ఉంటూ వస్తుంది. అయితే ఈమద్య కాలంలో దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అన్ని భాషల హీరోయిన్స్‌ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్‌ కౌచ్‌ల గురించి చెబుతున్నారు. కొందరు కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాటం కూడా ప్రారంభించారు. తెలుగు సినిమా పరిశ్రమలో రోజుకో హీరోయిన్‌ ఈ విషయమై మాట్లాడుతున్న కారణంగా తెలుగులో ఏ రేంజ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందో అర్థం అవుతుంది. ఇక తెలుగు సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్‌లో కూడా ఈ విష సంస్కృతి ఉందని గతంలో హీరోయిన్స్‌ చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. ఆమద్య కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేయగా, తాజాగా ప్రముఖ హాట్‌ హీరోయిన్‌ మల్లికా షరావత్‌ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

మల్లికా షరావత్‌ మాట్లాడుతూ… బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ అంతా కూడా ఏదో ఒక సమయంలో పరిస్థితులకు తలొగ్గి తమను తాము అర్పించుకునే ఉంటారు. నేను కెరీర్‌ ఆరంభించిన సమయంలో ఎంతో మంది హీరోలు అర్థరాత్రి సమయంలో మనుషులను పంపించి గెస్ట్‌ హౌస్‌కు రప్పించుకునేవారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఎంతో మంది హీరోలు నన్ను వారి బెడ్‌రూంకు రమ్మని పిలిచారు. ఒక దర్శకుడు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వస్తావా రావా అంటూ మానసికంగా వేదించాడు. ఆ దర్శకుడు ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. తాను సినిమాలో రాణించేందుకు ఎంత కష్టపడ్డానో ప్రేక్షకులు చూడకుండా, ఏమైనా తాను వెండి తెరపై హీరోలతో చేసిన రొమాన్స్‌ మరియు ముద్దు సీన్స్‌ను మాత్రమే చూశారు అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్స్‌ ఎప్పుడైతే పడక సుఖాలకు పనికి రారు అని దర్శకులు, హీరోలు భావిస్తారో అప్పటి నుండి అవకాశాలు తగ్గుతాయని మల్లికా చెప్పుకొచ్చింది. మొత్తానికి సినిమా ఎక్కువ శాతం హీరోయిన్స్‌కు పడుకోవడం వల్లే చాన్స్‌లు వస్తున్నాయని మల్లికా షరావత్‌ అంటోంది.