మీటూ: మంచు లక్ష్మిని టచ్‌ చేస్తారా…!

Madhavi Latha Comments On Manchu Lakshmi

మీ టూ ఉద్యమం ప్రస్తుతం సినీ పరిశ్రమలను కుదిపేస్తున్నాయి. మీ టూ ద్వారా ఇన్నాళ్లు బుద్దిమంతులుగా పేరు తెచ్చుకున్న వారి అసలు రంగు బయట పడుతుంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌లో నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల నుండి కాస్టింగ్‌ కౌచ్‌ చర్చ జరుగుతోంది. చాలామంది హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. వారిలో హీరోయిన్‌ మాదవిలత ముందున్నారు. అప్పటి నుండే మాదవిలత కాస్టింగ్‌కౌచ్‌ గురించి మాట్లాడుతోంది. తాజాగా మీ టూ లో భాగంగా మాదవిలత మరోసారి కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు.

manchu-laxmi

ఓ సినీ ప్రముఖుడు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తే ఎవరినైనా సరే చెంప చెల్లుమనిపించండి అంటూ సెలవిచ్చాడు. కానీ అలా చేసిన తర్వాత సినిమా తన ప్రపంచం అనుకున్న అమ్మాయికి అవకాశాలు వస్తాయని మీరు గ్యారెంటీ ఇస్తారా? అలా ఇస్తే అమ్మాయిలు తమను వేధించిన వారందరిని కూడా చితకబాదుతారు అంటూ కౌంటర్‌ ఇచ్చింది. టాలీవుడ్‌ సినీ పెద్ద మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మిని ఎవరైనా టచ్‌ చేస్తారా? ఆమెను మాటలతో అయినా టీజ్‌ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఉండదు ఎందుకంటే ఆమె పరిశ్రమ పెద్ద, మంచు మోహన్‌ బాబు కూతురు. కాబట్టి ఈమెను టచ్‌ చేసే ధైర్యం ఉండదు. కానీ ఇలాంటి వాళ్లు కాస్టింగ్‌ కౌచ్‌ ఉండదు అని చెప్పడం అంత కరెక్ట్‌ కాదు. వారికేం తెలుసు మా బాధలు, స్టార్‌ హీరోయిన్లు కూడా అవకాశాల విషయం పక్కన పెట్టి దీనిపై స్పందిస్తే కొన్ని రోజుల తర్వాత అయినా సినీ పరిశ్రమలో పని చేసే ఆడవారికి రక్షణ ఉంటుంది అంటూ మాదవి లత చెప్పుకొచ్చింది.

Madhavi Latha Respond On Casting Couch