‘ఎన్టీఆర్‌’ వివాహం కూడా…!

Ntr Biopic Movie Dubbing As Sr Ntr

సినీ, రాజకీయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన అన్నగారు నందమూరి తారకరామారావు గారి బయెపిక్‌ ‘ఎన్టీఆర్‌’ క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రెండు రంగాల్లో పేరుగాంచిన ఎన్టీఆర్‌ గురించి ‘ఎన్టీఆర్‌’ రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయబోతున్నారు. అన్నగారిగా చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన ఎన్టీఆర్‌ జీవిత ఘట్టంలో ఏమేమి ఉన్నాయె తెలుసుకోవాలని అందరికి ఆసక్తి నెలకొంది. రెండు పార్టులలో ఏం చూపించబోతున్నారు అని ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల్లో కూడా ఆసక్తిగా ఉంది. మొదటి భాగంలో ఎన్టీఆర్‌ సినీ ప్రస్థానం గురించి ఉండగా, రెండో భాగంలో రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌ పాత్ర ఉండబోతుంది.

ntrr-bio-pic

మొదటి భాగంలో భాగంగా శ్రీదేవి పాత్రలో రకుల్‌, జయప్రద పాత్రలో తమన్నాలు కనిపించబోతున్నారు అనేది తెల్సిందే. ఎన్టీఆర్‌ వివాహ ఘట్టాన్ని కూడా ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారట. అందుకు క్రిష్‌ టీం చాలా పరిశోదన చేసి అప్పట్లో వివాహం జరిగిన విధానం, ఆ కట్టు, బొట్టు ఏంటి అని తెలుసుకుని తాజాగా వివాహ ఘట్టంను తెరకెక్కిస్తున్నారు అని తెలుస్తోంది. షూటింగ్‌కు కాస్త విరామాన్ని ఇచ్చిన విద్యాబాలన్‌ తాజాగా షూటింగ్‌లో పాల్గొంది. ఈ చిత్రంలో అన్నగారి సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ అగ్రతార విద్యాబాలన్‌ కనిపించనున్నారు. ‘ఎన్టీఆర్‌’లో వివాహ ఘట్టం కూడా ఉంది అనడంతో ఇప్పటి నుండే సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

dyaballan