అప్పుడు అవకాశాల కోసం అలా.. ఇప్పుడు మీటూ…!

Kannada Actress Harshika Poonacha Shares Her Casting Couch

బాలీవుడ్‌ నటి తనూశ్రీ ప్రముఖ నటుడు నానాపటేకర్‌పై లైంగిక ఆరోపణలు చేసి ఇండియాలో మీ టూ ఉద్యమాన్ని వేడిక్కించింది. ఈ ఉద్యమం కాస్త ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమల్లో వాడీవేడిగా జరుగుతోంది. చాలామంది నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడులను బహిరంగ పర్చుతున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీలో కాకుండా ఇతర రంగాల్లో పనిచేసే మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీ టూలో భాగంగా బయట పెడుతున్నారు. కన్నడ సినిమా పరిశ్రమలో ఓ హీరోయిన్‌ స్టార్‌ హీరోపై సంచలన ఆరోపణలు చేసి తీవ్ర ధుమారాన్ని రేపుతున్న విషయం తెల్సిందే. అందుకు కొందరు మద్దతు తెలపగా ఆరోపణలను మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

Poonacha-Shares-Her-Casting

కన్నడ నటి హర్షిక మీటూ ఉద్యమంపై స్పందించి మరింత కలకలం సృష్టిస్తోంది. హర్షిక ఎవరి పేరు బయటపెట్టకుండా… అప్పుడు అవకాశాలు, డబ్బు, విలాసవంతమైన జీవితం కోసం మగాళ్లకు ఫ్రీడమ్‌ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు మీ టూ అంటూ రచ్చ చేస్తున్నారు. అవకాశాల కోసం మగాళ్లను వాడుకుని ఇప్పుడు మీ టూ అని చెప్పి వారిపై ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు న్యాయం. కొన్నాళ్ల క్రితం ఓ నిర్మాత నాకు వీడియో పంపించారు. అందులో ఒక హీరోయిన్‌ గంజాయి సేవిస్తూ అర్థ నగ్నంగా ఒక వ్యక్తితో ఉంది, అతనిపై చేతులు వేసి నాకు అవకాశాలు కావాలి అతడిని వేడుకుంటుంది. అయితే ఆమె ఎవరో కాదు, ఇప్పుడు మీటూ ఉద్యమంలో భాగం అంటూ నానా రచ్చ చేస్తున్న హీరోయిన్‌ అంటూ పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా చెప్పకనే ఆ అమ్మడిపై క్లారిటీ వచ్చేలా చెప్పింది. అలాని నేను మీ టూకు వ్యతిరేకం కాదు.

Kannada-Actress-Harshika-Po