స్పందించిన సమంత… మీ టూ ఇండియా…!

Samantha Akkineni Supports MeToo

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో గతకొంత కాలంగా మీటూ ఉద్యమం జరుగుతున్న విషయం తెల్సిందే. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం టాలీవుడ్‌లో కూడా ఊపందుకుంది. కొంతమంది సెలబ్రిటీలు ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి తమవంతు సాయంగా మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. తాజగా సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద మీ టూ ఉద్యమానికి తన మద్దతు తెలిపింది. అంతేకాకుండా తనపై జరిగిన లైంగిక వేధింపుల్ని కొన్ని బహిరంగంగానే పోస్ట్‌ చేసింది.

samantha

తాజాగా అగ్ర కథానాయిక సమంత కూడా మీ టూ ఉద్యమానికి తన మద్దతును తెలుపుతోంది. మీ టూ ఉద్యమానికి ఎంతో మంది అగ్రతారలు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది, ఇలా చేయడం వల్ల భవిఫ్యత్‌లో చాలామంది అమ్మాయిలని రక్షించినట్లువుతుంది, ఇలా చేసే వారికి కూడా అనుమానాలు, ఆధారాు అనే అడ్డంకులు రావచ్చు కానీ చాలా మంది అమ్మాయిల్ని మీ గొంతుకతో కాపాడగలుగుతున్నారు, మీ టూ ఇండియాకు నా మద్దతిస్తున్నాను అంటూ సమంత స్పందించింది.

samantha-pics