న్యూ ఇయర్ వేడుకలలో రిలాక్స్ అవుతున్న సమంత…!

న్యూ ఇయర్ వేడుకలలో రిలాక్స్ అవుతున్న సమంత...!
Cinema News

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తుంది . ఇక తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.

అయితే… కొత్త సంవత్సరం నేపథ్యంలో దిగిన ఫోటోని హీరోయిన్ సమంత ఇన్ స్టాలో షేర్ చేశారు. కాగా, సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.