కాసేపట్లో ఓటీటీలోకి వస్తున్న లియో.. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..?

కాసేపట్లో ఓటీటీలోకి వస్తున్న లియో.. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..?
Cinema News

స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలతో విడుదల అయిన విజయ్ తలపతి లియో సినిమా , థియేటర్ లలో ఎక్కువ రోజులు ప్రదర్శితం కాలేదన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఉన్నన్ని రోజులు యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి కలెక్షన్ లనే రాబట్టింది . థియేటర్ లలో అలరించిన విజయ్ సినిమా లియో ని ఓటిటి లో విడుదల చేయడానికి మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేసి ప్రకటించిన రోజు నుండి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో ఎంత చూసినా ఓటిటి లో చూడడానికి పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తూ ఉన్నారు . ఇక ఆ రోజు రానే వచ్చింది, తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు అనగా నవంబర్ 24 న నెట్ ఫ్లిక్స్ లో లియో మూవీ స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది.

కాసేపట్లో ఓటీటీలోకి వస్తున్న లియో.. మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..?
Leo Movie

ఇక ఈ సినిమాలో విజయ్, త్రిష, అర్జున్, సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్ లాంటి నటీ నటులు ఉన్నారు. మరి ఓటిటి లోనూ అధిక వ్యూస్ తో రికార్డ్ సృష్టిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది .