“లియో” డిజిటల్‌లోకి అడుగుపెడుతున్నాడు

లియో డిజిటల్‌లోకి అడుగుపెడుతున్నాడు
Cinema News

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లియో’. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తుంది . ఈ లియో సినిమా చివరకు నెట్‌ ఫ్లిక్స్‌ లో ఓటీటీ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నది . నెట్‌ ఫ్లిక్స్ తన ప్లాట్‌ ఫారమ్‌ లో ఈ నెల నవంబర్ 24వ తేదీ నుంచి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమాని అందుబాటులో తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

లియో డిజిటల్‌లోకి అడుగుపెడుతున్నాడు
Cinema News
"లియో" డిజిటల్‌లోకి అడుగుపెడుతున్నాడు
Thalapathy Vijay

ఐతే, ఓవర్సీస్‌లో మాత్రం నవంబర్ 28వ తేదీ నుంచి ప్రదర్శించబడుతుందట. మరి ఈ గ్యాప్ వెనుక ఉన్న కారణం మాత్రం ఇంకా ఏమి తెలియదు. ఈ ‘లయో’ సినిమా భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా లో విజయ్ నటన, యాక్షన్ సీన్స్ మరియు క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి, ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.