ఇంగ్లీషులో లియో: గొప్ప ఆరంగేట్రం!

ఇంగ్లీషులో లియో: గొప్ప ఆరంగేట్రం!
Cinema News

ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా సినిమా లియో కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా అనేక అంచనాలు నడుమ వచ్చి పర్వాలేదు అనిపించింది. మరి ఈ సినిమా ఓటిటిలోకి వచ్చిన తర్వాత కూడా భారీ రెస్పాన్స్ ని అయితే అందుకుంది. మరి నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా ని మొదటగా పాన్ ఇండియా భాషల్లో ఇండియా అలాగే గ్లోబల్ గా కూడా చిన్న మార్పులతో తీసుకొచ్చారు.

ఇంగ్లీషులో లియో: గొప్ప ఆరంగేట్రం!
Leo Movie

మరి ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని అప్పుడే నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు నేటి నుంచి అయితే ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసారు. మరి ఇంగ్లీష్ వెర్షన్ లో చూడాలి అనుకుంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ని ట్రై చేయవచ్చు. ఇక ఈ భారీ సినిమా కి అనిరుద్ సంగీతం అందించగా 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.