“ఓపెన్ హైమర్ “సినిమాకు తెలుగు ఓటిటి లో కూడా చూడొచ్చు ..!

"Oppenheimer" movie can also be seen in Telugu OTT..!

రీసెంట్ గా ఆస్కార్ (Oscars 2024) సెన్సేషన్ మూవీ “ఓపెన్ హైమర్” (Oppenheimer) కోసం అందరికీ తెలిసిందే. కిలియన్ మర్ఫీ (Cillian Murphy) ప్రధాన పాత్రలో హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన ఈ మూవీ భారీ వసూళ్లు అందుకుని కూడా అదరగొట్టింది. మరి అకాడమీలో కూడా ఏకంగా 6 అవార్డ్స్ ను అందుకొని చిత్ర యూనిట్ కు గర్వ కారణంగా నిలిచింది.

ఇక ఈ మూవీ జస్ట్ కొన్ని రోజులు కితమే ఇండియాలో ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంగ్లీష్ సహా హిందీ భాషల్లో ఈ మూవీ మొదట అందుబాటులోకి వచ్చింది. అయితే నోలన్ బ్రాండ్ కి ఉన్న పేరుతో తెలుగులో కూడా ఈ మూవీ కోసం ఎదురు చూసినవారు లేకపోలేరు. మరి వారికి ఇతర ప్రాంతీయ వెర్షన్ కోసం ఎదురు చూసే వారికి కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది.

"Oppenheimer" movie can also be seen in Telugu OTT..!
“Oppenheimer” movie can also be seen in Telugu OTT..!

ఈ మూవీ ఇప్పుడు తెలుగు సహా దాదాపు ఇండియాలో ప్రముఖ భాషలు అన్నిటిలో కూడా పాన్ ఇండియా ఓటిటి రిలీజ్ కు ఈ మూవీ వచ్చేసింది. అదే జియో మూవీ లో ఈ మూవీ ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి తెలుగులో ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు అయితే ఈ మూవీ ని జియో సబ్ స్క్రిప్షన్ ఉంటే వీక్షించవచ్చు.