జీ5 OTTలోకి ‘హనుమాన్’.. ఎప్పుడంటే?

జీ5 OTTలోకి ‘హనుమాన్’.. ఎప్పుడంటే?
Cinema News

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన మూవీ ‘హను-మాన్‌ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ మూవీ కి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ మూవీ వస్తున్న విషయం అందరికి తెలిసిందే. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వారంలో కొత్త తెలుగుమూవీ ల రిలీజ్ లు లేకపోవడంతో త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

జీ5  OTTలోకి ‘హనుమాన్’.. ఎప్పుడంటే?
Hanuman Movie

జనవరి 12న విడుదలైన ‘హనుమాన్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. సాధారణంగా మూవీ రిలీజ్ అయిన మూడు వారాల్లో ఓటీటీకి రావాలి. కానీ ఈ మూవీ కి థియేటర్లలో మంచి స్పందన వస్తుండడంతో 55 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి మొదటి వారంలో స్ట్రీమింగ్ కానుంది.