Sports: మూడో రోజు ముగిసిన ఆట… రసవత్తరంగా ఉప్పల్‌ టెస్టు

Sports: The game ended on the third day... a juicy Uppal Test
Sports: The game ended on the third day... a juicy Uppal Test

హైదరాబాదులో ఉప్పల్ స్టేడియంలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 రన్స్ చేసి 126 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో యువ బ్యాటర్‌ ఓలీ పోప్ సెంచరీతో చెలరేగాడు. భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 రన్స్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో పోప్ తో పాటు రెహాన్ అహ్మద్ (16) ఉన్నాడు.

ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (47), జాక్‌ క్రాలే (31)లు ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 45 చేశారు.డకెట్‌ను బుమ్రా ఔట్‌ చేయగా క్రాలే ను అశ్విన్‌ ఔట్ చేశాడు. ఇదే క్రమంలో భారత్ .. జో రూట్‌ (2), జానీ బెయిర్‌ స్టో (10), బెన్‌ స్టోక్స్‌ (6) వికెట్లను త్వర త్వరగా పడగొట్టింది.పోప్ కు వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ నుంచి చక్కని సహకారం అందడంతో ఫోక్స్‌తో ఆరో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఫోక్స్ 34 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. భారత్ బౌలర్లలో బుమ్రా 2, అశ్విన్ 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ , రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 పరుగులు చేయగా, భారత్ 436 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.