Election Updates: పిఠాపురం నుంచే జనసేన ప్రచారానికి శ్రీకారం

Election Updates: What was the purpose of the trip when there was no electricity? Pawan Kalyan
Election Updates: What was the purpose of the trip when there was no electricity? Pawan Kalyan

దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన పార్టీ ప్రకటించింది. వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారని, ఆ నియోజకవర్గంలోనే 3 రోజులు ఉంటారని తెలిపింది. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో YCP ఎన్నో పన్నాగాలు పన్నుతోందని.. అప్రమత్తంగా ఉండాలని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు జనసేన వెల్లడించింది.

కాగా, 21 అసెంబ్లీ, 2 ఎంపి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధినేతతో పాటు ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రెండు లోక్ సభ స్థానాలపైనా క్లారిటీకి వచ్చింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు సంబంధించి చివరి దశ కసరత్తు కొనసాగుతోంది. 3 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు జనసేన అధినేత.