‘టైగర్‌’అనే దానితో నా కల నెరవేరింది : ప్రియాంక చోప్రా

'Tiger' made my dream come true: Priyanka Chopra
'Tiger' made my dream come true: Priyanka Chopra

గ్లోబల్ స్టార్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’ ‘టైగర్‌’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకి డబ్బింగ్ చెప్పింది. ఐతే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి ‘ప్రియాంక చోప్రా’ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇంతకీ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం .. ‘‘నేను ప్రకృతికి సంబంధించిన మూవీ లను బాగా ఇష్టపడతాను. ఒక విధంగా పెద్ద అభిమానిని కూడా . మనదేశం నుంచి వస్తున్న ‘టైగర్‌’ అనే కథని నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవడం నేను గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని ‘ప్రియాంక చోప్రా’ చెప్పింది.

'Tiger' made my dream come true: Priyanka Chopra

‘Tiger’ made my dream come true: Priyanka Chopra

‘ప్రియాంక చోప్రా’ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఒక నటిగా ఎన్నో పాత్రలను చేశాను. కానీ.. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే అనేక భావోద్వేగాలని పలికించాలి. అలాగే, ఆ ఎమోషన్స్ ను నా మాడ్యులేషన్ తోనే పండించగలగాలి. నిజంగా ఇది ఒక పెద్ద సవాలే. ఏది ఏమైనా వేరే మూవీ కి నా వాయిస్ అందించాలనే నా కోరిక ఈ ‘టైగర్‌’తో నెరవేరింది అని ‘ప్రియాంక చోప్రా’ తెలిపింది. అన్నట్టు ‘టైగర్‌’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నది .