కాజల్‌ స్థానంలో పాయల్‌కు చోటు!

Payal Rajput Signs Her Second Film

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ జోరు ఈమద్య కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం రాకపోవడంతో చిన్న హీరోలతో కానిచ్చేస్తోన్న ఈ అమ్మడు తాజాగా భాను శంకర్‌ దర్శకత్వంలో ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అర్థనారి చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న భాను శంకర్‌ చెప్పిన కథ నచ్చడంతో కాజల్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో ఆయన హుషారుగా స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌ను కాజల్‌ చేతిలో పెట్టిన దర్శకుడు భాను శంకర్‌కు ఆమె షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఈ స్క్రిప్ట్‌లో నటించలేను అంటూ వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.

payal

కాజల్‌ తప్పుకోవడంతో సదరు ప్రాజెక్ట్‌కు పాయల్‌ రాజ్‌పూత్‌ను దర్శకుడు ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ పాయల్‌కు పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని బోల్డ్‌ పాత్రలు మరియు అవే తరహా మూస గ్లామర్‌ పాత్రలు అవ్వడంతో ఆమె నో చెబుతూ వచ్చింది. ఎట్టకేలకు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం మరియు మంచి నటకు ఆస్కారం ఉన్న పాత్ర రావడంతో దర్శకుడు భాను శంకర్‌కు పాయల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈనెలలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. పాయల్‌ రెండవ సినిమా విషయంలో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.

payal