మంగళవారం మేకింగ్ వీడియోలో ఏమి ఉంది…….

మంగళవారం మేకింగ్ వీడియోలో ఏమి ఉంది.......
Cinema News

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా మంగళవారం. నవంబర్ 17, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది . ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార సినిమా లకి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, మంచి హైప్ కూడా వచ్చింది. పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్ళై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రావణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కి కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించారు.

మంగళవారం మేకింగ్ వీడియోలో ఏమి ఉంది.......
Mangalavaram Movie

తాజాగా ఈ సినిమా కి సంబందించిన మేకింగ్ వీడియోను ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మూవీ కోసం ఎంతగా ఎఫర్ట్స్ పెట్టారు అనేది ఈ వీడియో ను చూస్తే తెలుస్తుంది . ముద్ర మీడియా వర్క్స్ మరియు ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లపై స్వాతి రెడ్డి, సురేష్ వర్మ లు నిర్మించిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.