బోయిన్‌పల్లిలో బాబు బ్లాక్ మెయిల్ … మహిళ సూసైడ్ అటెంప్ట్

Lady Sucide Attempt At Boyinpalli Ps

ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంట జీవితాల్లోకి ప్రవేశించిన ఒక నీచుడు వారి జీవితాలను చిదిమేసాడు. ఒక ఆకతాయి వేధింపులు ఆ మహిళ ప్రాణాల మీదికి తెచ్చాయి. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. కానీ ఆమె గోడును పట్టించుకున్నవారే లేరు. ఖాకీల తీరుతో విసుగెత్తిన ఆమె ఏకంగా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది. అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్‌ ముందు ఆత్మహత్యా యత్నం చేసింది సబిత. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఎదుట జరిగింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన దినేశ్‌ కంటోన్మెంట్‌ తాడుబంద్‌బజార్‌కు చెందిన సబిత (26) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

boinapalli-suside

దినేష్‌ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసించే వెంకటేశ్‌ గౌడ్‌ ఆ ఇల్లాలు స్నానం చేస్తుండగా ఫోన్లో వీడియో తీశాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోక పోతే వాటన్నిటినీ సామాజిక మాధ్యమాలలో పెడతానని బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. ఈ విషయం దినేష్ దాకా వెళ్ళడతో వారి మధ్య వివాహేతర బంధం ఉందని భావించిన అతను ఆమెను పుట్టింటికి పంపేశాడు. అయితే నిజాన్ని భర్తతో చెప్పలేకపోయిన ఆమె బేగంపేట్‌ పోలీసులను ఆశ్రయించింది. వారేమో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అయినా భర్త తనను తీసుకెళ్ళక పోవడంతో ఆమె మనోవేదనకు గురైంది. మంగళవారం తమ ప్రాంత పరిధి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి సుసైడ్‌నోట్‌ ఉన్న చేతి సంచిని కొద్దిదూరంలో పడేసి ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. పోలీసులు స్పందించే లోపే మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడింది. మంటలను ఆర్పిన పోలీసులు బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బేగంపేట్‌ ఏసీపీ రంగారావు ఆసుపత్రిలో బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తహసీల్దారు ఆమె వాంగ్మూలాన్ని నమోదుచేశారు. మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యు అంటున్నారు. ఆడపిల్లకి ఏమయినా జరిగితే క్షణాల్లో వారి సమస్య తీరుస్తామనే మన నాయకులుఎందుకో కొందరికి మాత్రం కొమ్ము కాస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

BONAPALLI-WOMEN-SUSIDE