సామాన్యులకు పెద్ద షాక్…పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

A big shock for the common man…increased gas cylinder price
A big shock for the common man…increased gas cylinder price

మన ఇండియాలో సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో సిలిండర్ ధరలు వేయి రూపాయలు దాటేశాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ నవంబరు ఒకటో తేదీ అన్న సంగతి తెలిసిందే. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఈ తరుణంలోనే ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలలో మార్పుల నేపథ్యంలో ఎల్పిజి సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధరను 101.50 రూపాయల వరకు పెంచాయి కంపెనీలు. నేటి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1833 రూపాయలకు చేరింది. అయితే గృహ అవసరమైన సిలిండర్ ధరలలో కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు . కాగా ఇటీవల డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం… కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుతూ వస్తోంది.