షారుఖ్ ఖాన్ బర్త్ డే NOV 2న బ్లాస్టింగ్ సర్ప్రైజ్ !

షారుఖ్ ఖాన్ బర్త్ డే NOV 2న బ్లాస్టింగ్ సర్ప్రైజ్ !
Cinema News

నవంబర్ 2వ తేదీన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన పుట్టినరోజును జరుపుకోనున్నారు . . ఈ సందర్భాన్ని పురస్కరించుకుని షారుఖ్ ఖాన్ తన అభిమానులకు ఒక సర్ప్రైజ్ ను ప్లాన్ చేసి అందిస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ 2వ తేదీన ఇటీవల తాను నటించిన పాన్ ఇండియా మూవీ జవాన్ ను ఓటిటి లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ షారుఖ్ ఖాన్ మరియు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ లు బాగా దక్కించుకుని ఇంకా కొన్ని చోట్ల ప్రదర్శితం అవుతుంది . ఇప్పటి వరకు జవాన్ సినిమా సాధించిన కలెక్షన్ లు చూస్తే రూ.1100 కోట్లు గా ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాన్ని సాధించింది.

షారుఖ్ ఖాన్ బర్త్ డే NOV 2న బ్లాస్టింగ్ సర్ప్రైజ్ !
Shah Rukh Khan

శుక్రవారం నుండి ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. కాగా ఈ ఓటిటి లో థియేటర్ లో నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సీన్ లను కూడా కలపనున్నారు.