కాంగ్రెస్ ముందస్తు కసరత్తులు…రేవంత్ రెడ్డికి కీలక పదవి…!

Revanth Reddy Position In Telangana Congress

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడడంతో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారు. అన్ని పార్టీలు ఉన్నా తెరాస కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు సాగనుంది. ముందస్తు వ్యూహాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 9 కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు, వాటి వివరాలను ఢిల్లీలో ఏఐసీసీ ప్రతినిధి అశోక్ గెహ్లాట్ నిన్న సాయంత్రం ప్రకటించారు. ఈ కమిటీలలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కి కీలక పదవి లభించింది. రేవంత్ రెడ్డి సహా పొన్నం ప్రభాకర్‌లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది.

raventh
53 మందితో కో ఆర్డినేషన్ కమిటీ, 15 మందితో కోర్ కమిటీ, 41 మందితో ఎన్నికల కమిటీలను నియమించారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఎలక్షన్, క్యాంపెయిన్, మ్యానిఫెస్టో లాంటి మూడు కమిటీలలో అవకాశం కల్పించడం గమనార్హం. దీనిని బట్టి ఈ కమిటీ ఎపుడో రూపకల్పన జరిగిందని వాటిని ఇప్పుడు కనీస పరిశీలన చేయకుండానే విడుదల చేసినట్టి అర్ధం అవుతోంది. ఒక జాతీయ పార్టీ ఏకంగా ఒక రాష్ట్ర ఎన్నికల కమిటీ విడుదల చేసేముందు కనీస పరిశీలన కూడా చేయకపోవడం మీద నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

congress
కమిటీలలో కీలక స్థానాలు పొందిన ముఖ్యనేతల వివరాలు :
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ,
పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ఆర్.సి.కుంతియా,
కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి,
ప్రచార కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్,
ప్రచార కమిటీ కో కన్వీనర్‌గా డీకే అరుణ,
స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా వి.హనుమంతరావు,
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క,
ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి,
క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిలను కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.