ఈనెల 16 నుంచి సివిల్ ఎస్ఐలకు ట్రైనింగ్..

Training for civil SIs from 16th of this month.
Training for civil SIs from 16th of this month.

తెలంగాణ సివిల్ ఎస్సైలకు బిగ్ అలర్ట్. ఈనెల 16 నుంచి ఇటీవల కొత్తగా ఎంపికైన సివిల్ ఎస్సైలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు RBVRR పోలీస్ TS అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో వివిధ కారణాలతో ట్రైనింగ్ పూర్తి చేయని మరో 19 మందితో పాటు , కొత్తగా ఎంపికైన 414 మంది సివిల్ ఎస్సైలకు ట్రైనింగ్ ప్రారంభం కానుంది.

ఈ నెల 10న వారు అకాడమీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత మిగిలిన విభాగాల ఎస్సైలు ట్రైనింగ్ కు వస్తారు. కాగా, సిఎస్ శాంతి కుమారి ఇవాళ ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ బలిదానానికి సంస్మరణగా 40వ రోజు షియా ముస్లింలు జరుపుకునే అర్బాయిన్ సందర్భంగా తోలుత ఈనెల 6న ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. తాజాగా ఆ 7వ తేదీ సెలవుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అర్బాయిన్ జరుపుకునే ప్రాంతాల్లో ఇవాళ సెలవు ఉండనుంది.