‘మా’ వివాదం చిరు తలనొప్పి!

Chiranjeevi steps in maa controversy

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. శివాజీ రాజా, శ్రీకాంత్‌లు నిధుల దుర్వినియోగంకు పాల్పడ్డట్లుగా ఒక మీడియాలో కథనాలు రావడం జరిగింది. దాంతో వారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవెంటనే మా జనరల్‌ సెకట్రీ అయిన నరేష్‌ తీవ్ర స్థాయిలో శివాజీ రాజా మరియు శ్రీకాంత్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిధులను వారు దుర్వినియోగం చేశారని, సిల్వర్‌ జూబ్లీ వేడుకల సందర్బంగా భారీ ఎత్తున గోల్‌మాల్‌ జరుగుతుందని, చిరంజీవి కార్యక్రమంలో కూడా గందరగోళం జరిగింది అంటూ నరేష్‌ ఆరోపించాడు. ఇక కొందరు ఈ అవినీతిలో చిరంజీవి కూడా భాగస్వామ్యం ఉన్నాడు అంటూ వార్తలు రాస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింతగా ముదురుతోంది.

Chiranjeevi

ఇప్పటి వరకు మా లో చాలా విభేదాలు వచ్చాయి. కాని ఇలాంటి సీరియస్‌ వివాదం మాత్రం ఎప్పుడు రాలేదు. గతంలో ఎప్పుడు జరగని వివాదం పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో చిరంజీవి కూడా ఈ నిధు గోల్‌మాల్‌లో ఉన్నాడు అంటూ వార్తలు వస్తుండటంతో అంతా కూడా నివ్వెర పోతున్నారు. మా కు ఫౌండర్‌ చైర్మన్‌ అయిన చిరంజీవిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. వివాదం చుట్టు తిరిగి తనపైకి రావడంతో చిరంజీవి తల పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మా నిధుల సమీకరణ కోసం తాను ముందడుగు వేస్తే తనపై ఇలాంటి విమర్శలు చేయడం ఏంటని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది.

Controversy in maa association